
Beejakshara and Gayatri Maha Yaga
"Shri Gayatri Maha Yaga" on the occasion of Chaturmasya
చాతుర్మాస్య సందర్భంగా "శ్రీ గాయత్రీ మహా యాగము"
ఆద్యంతరహితము, ఆనాటి సిద్ధము, అపౌరుషేయ- -స్వరూపము అయిన శ్రీ వేదభగవంతుని యొక్క ప్రియమైన ధామము "పుణ్య, పవిత్ర భారతదేశము "
ఇందులో అందరినీ సత్సంస్కారవంతులుగా ప్రతి హిందువు కావాలని బ్రహ్మ గాయత్రీ మహా మంత్రోపదేశమును శ్రీ వేద భగవంతుడు మనకి ప్రసాదించాడు. అటువంటి గాయత్రీ మంత్రోపదేశమును పొంది, అనుష్టించి, దైవత్వమును పొంది మహర్షులుగా, సాధకులుగా, భక్తులుగా అయి" స్వయం తీర్త్వా పరాన్ స్తారయేత్ " అన్నట్లుగా తను తరించి సమాజంను తరింపజేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇంకా ఉంటారు కూడా, అందుకని శ్రీ వేదభారతీ పీఠం ఆశ్రమమునందు ' చాతుర్మాస్య మహా దీక్షలో భాగంగా లోక కళ్యాణార్థమై శ్రీ గాయత్రీ మహా యాగము 21 జూలై 2014 నుండి 15 నవంబర్ 2024 వరకు పూజ్యశ్రీ గురుదేవులు సంకల్పించినారు.
కావున భక్తులందరూ ఈ మహాయాగంనందు మనసా, వాచా, కర్మణా పాల్గొని వస్తురూపేణ, ధనరూపేణ గానీ, మీకు తోచిన విధంగా సహాయం చేసి గాయత్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము .